హైదరాబాద్: హైదరాబాదులో వరదనీటికి ఓ ఉపాధ్యాయుడు బలయ్యాడు. సోమవారం సాయంత్రం భారీ వర్షం పడడంతో నగరమంతా వరదమయంగా మారింది. హైదరాబాదులోని జీడిమెట్లలో రమేష్ అనే ఉపాధ్యాయుడు కొట్టుకుని పోయాడు. అతని శవం చింతల్ లోని నాలాలో మంగళవారం ఉదయం కనిపించింది. సాయంత్రం ట్యూషన్ చెప్పడానికి వెళ్తూ అతను వరదలో మునిగిపోయాడు.
సోమవారం సాయంత్రం హైదరాబాదులో భారీ వర్షం కురిపించింది. దీంతో హైదరాబాదు రోడ్లు వరద ప్రవాహంతో నిండిపోయాయి. వరదలకు హైదరాబాదులోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. గంటల తరబడి ట్రాఫిక్ రోడ్లపై నిలిచిపోయింది.