ఈనాడు వద్ద పీఆర్పీ నేతల ధర్నా

ఇదిలా పుంటే, ఈనాడు పత్రికలో వచ్చిన వార్తను పార్టీ శాసనసభ్యులు ఖండించారు. ఒక సామాజిక వర్గం పని కట్టుకుని ప్రజారాజ్యంపై దుష్ప్రచారం చేస్తోందని వారన్నారు. ప్రజారాజ్యం పార్టీని అంతం చేయలేరని ఆ పార్టీ శాసనసభ్యుడు కన్నబాబు అన్నారు. తమ పార్టీపై విషం చిమ్మే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన అన్నారు. స్వార్థపరులు మాత్రమే పార్టీని విడిపోయారని ఆయన విమర్శించారు. పీఆర్పీని అంతం చేసే శక్తి ఎవరికీ లేదని ఆయన అన్నారు.
అసెంబ్లీ లాబీలో సరదాగా మాట్లాడుకున్న మాటలను మీడియా వక్రీకరించిందని ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యుడు మహేశ్వర రెడ్డి అన్నారు. తాను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు వచ్చిన వార్తలను ఆయన గురువారం ఖండించారు. తాను పార్టీ వీడే ప్రసక్తి లేదని, పీఆర్పీని ఏ పార్టీలోనూ విలీనం చేసే ఆలోచన లేదని ఆయన చెప్పారు. పీఆర్ప్ కాంగ్రెసులో విలీనమవుతున్నట్లు వచ్చిన వార్తల్లో తెలుగుదేశం ప్రమేయం ఉందని ఆయన అన్నారు.
తమ పార్టీపై తప్పుడు వార్తలు రాసిన పత్రికల యాజమాన్యాలు తక్షణమే క్షమాపణ చెప్పాలని ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యురాలు వంగా గీతా డిమాండ్ చేశారు. కాంగ్రెసులో తమ పార్టీ విలీనం అవుతున్నట్లు వచ్చిన వార్తను రాసిన ప్రతినిధి పేరు బయట పెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. శాసనసభ్యులు వెళ్లిపోతే పార్టీ పోతుందా అని ఆమె అడిగారు. ఈనాడులో వచ్చిన వార్తను శోభా నాగిరెడ్డి కూడా విమర్శించారు. ఆధారం లేకుండా వార్తలు రాస్తున్నారని ఆమె అన్నారు. ఈనాడులో వచ్చిన వార్తలను మిగతా ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులు కూడా ఖండించారు.












Click it and Unblock the Notifications
