దేవుడి సొమ్ములు పూజారి స్వాహా

హైకోర్టు ఆదేశాలతో టిటిడి అనుబంధ ఆలయాల్లో ఇటీవల నగల లెక్కింపు ప్రారంభమైంది. దీంతో కోదండ రామాలయంలో నగలు మాయమైన విషయం బయట పడింది. టిటిడి ఈఓ ఐవిఆర్ కృష్ణారావు ఆదేశాల మేరకు దేవస్థానం నిఘా విభాగం అధికారులు శుక్రవారం సాయంత్రం దీక్షితులను మొదట అదుపులోకి తీసుకుని చేపట్టారు. నగలు తాకట్టు పెట్టుకున్న కామధేను ఫైనాన్షియర్ కార్యాలయానికి వెళ్లి రికార్డులు స్వాధీనం చేసుకోవాలని టిటిడి ముఖ్య నిఘా, భద్రతాధికారి పివిఎన్ రామకృష్ణను ఆదేశించారు నిర్లక్ష్యంగా వ్యవహరించిన భద్రతా సిబ్బందిని విధుల నుంచి తప్పించారు.












Click it and Unblock the Notifications