జమ్మూ: జమ్మూ కాశ్మీర్ లోని కిష్త్వార్ జిల్లా కెష్వాన్ ప్రాంతంలో జరిగిన భద్రతా బలగాలతో జరిగిన ఎదురు కాల్పుల్లో గురువారం ఒక లష్కరే తోయిబా ఉగ్రవాది హతమయ్యాడు. నిఘా సంస్థల నుంచి అందిన సమాచారం మేరకు సైనికులు, పోలీసులు కేశ్వాన్ అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సమయంలో గురువారం తెల్లవారుజామున ఎదురు కాల్పులు జరిగాయి.
ఎదురు కాల్పుల్లో మరణించిన ఉగ్రవాదిని మొహ్మద్ యూసుఫ్ అలియాస్ అబూ సలీంగా గుర్తించారు. ఆ తర్వాత కూడా ఎదురుకాల్పులు కొనసాగాయి. బుధవారం జరిగిన మరో ఎదురుకాల్పుల సంఘటన నుంచి ఇద్దరు ఉగ్రవాదులు తప్పించుకుని పారిపోయారు.