రాంచీ: జార్ఖండ్ రాష్ట్రంలోని లతేహార్ జిల్లాలో మావోయిస్టులు పోలీసు జీపుపై దాడి చేశారు. భద్రతా బలగాలపైకి నక్సలైట్లు కాల్పులు జరిపినట్లు పోలీసులు గురువారం తెలిపారు. ఈ కాల్పుల్లో ప్రత్యేక సాయుధ పోలీసు బలగాల అధికారి మరణించగా, మరొకరు గాయపడ్డారు. లతేహార్ జిల్లాలోని చోర్ముడా లోయలో ఈ సంఘటన జరిగింది. పోలీసులు నేటాహార్ హట్ నుంచి తిరిగి వస్తుండగా ఈ సంఘటన జరిగింది.