అసెంబ్లీలో 'క్షుద్రరాజకీయ' దుమారం

టీవీ రామారావుపై కేసు రాజకీయ కుట్ర అని ఆనయ అన్నారు. కలెక్టర్, ఎస్పీ నేరం జరగలేదని చెప్పినా రామారావుపై అన్యాయంగా కేసు పెట్టారని నర్సింహులు అన్నారు. దళితులకు కాంగ్రెసు ప్రభుత్వ హయంలో అన్యాయం జరుగుతోందని, సమాజంలో వారిని గౌరవంగా బతకనివ్వటం లేదని ఆయన విమర్శించారు. వాకపల్లి మహిళలు తమపై అత్యాచారం చేసిందని ఆరోపించినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన అన్నారు.
టివీ రామారావు అరెస్టుపై చర్చ సందర్భంగా కాంగ్రెసు సభ్యుడు శైలజానాథ్ చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్య చేశారు. చంద్రబాబు క్షుద్రరాజకీయాలు మానుకోవాలని ఆయన అన్నారు. బాబు రాజకీయాలకు రామారావు సమిధ అవుతున్నారని ఆయన అన్నారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. శైలజానాథ్ వాడిన పదాన్ని రికార్డుల నుంచి తొలగించాలని ప్రజారాజ్యం, తెలంగాణ రాష్ట్ర సమితి, వామపక్షాల సభ్యులు కోరారు. రికార్డులు పరిశీలించిన తర్వాత వాటిని తొలగించే విషయంపై నిర్ణయం తీసుకుంటానని సభాధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ చెప్పారు. శైలజానాథ్ వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతుండగానే సభ సోమవారానికి వాయిదా పడింది.












Click it and Unblock the Notifications