వసుంధర రాజెకు ఢిల్లీ పిలుపు

ప్రతిపక్ష నాయకురాలిగా దిగిపోవాలని పార్టీ నాయకత్వం ఇచ్చిన ఆదేశాలను వసుంధర రాజె ధిక్కరిస్తూ వస్తున్నారు. పైగా రాజస్థాన్ శాసనసభ ఎదుట స్పీకర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శాసనసభ్యులతో కలిసి ధర్నా చేశారు. బిజెపి పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇదంతా ప్రభుత్వాన్ని వ్యతిరేకించడానికే చేసినట్లు చెప్పుకుంటున్నప్పటికీ పార్టీ నాయకత్వానికి తనకు బలాన్ని తెలియజెప్పే ఉద్దేశంతోనే జరిగిందని భావిస్తున్నారు. దీనిపై పార్టీ నాయకత్వం తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications