రాంచి: మావోయిస్టులుగా అనుమానిస్తున్నవారు బుందు ప్రాంతంలో నలుగురిని కాల్చి చంపారు. ఈ సంఘటన రాంచీకి 50 కిలోమీటర్ల దూరంలో గల నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత జరిగింది.
ఇద్దరు కాలేజీ విద్యార్థులు, ఒక బాలిక, ఒక స్త్రీ ఒక ఘటనలో మరణించారు. మావోయస్టులు ఈ చర్యకు పాల్పడ్డారని చెప్పడానికి ఖాళీ కాట్రడ్జిలు శవాల దగ్గర కనిపించినట్లు పోలీసు సూపరింటిండెంట్ అనూప్ టి మాథ్యూ చెప్పారు.