ముంబై: నవి ముంబైలో స్వైన్ ఫ్లూ వ్యాధికి 39 ఏళ్ల మహిళ మరణించింది. నవి ముంబైలోని డివై పాటిల్ ఆస్పత్రిలో ఎం షేక్ అనే మహిళ మరణించింది. గత రాత్రి ఆమె మరణించినట్లు నవి ముంబై చీఫ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ దీపక్ పరోపకారి చెప్పారు.
దేశంలో స్వైన్ ఫ్లూ వల్ల మరణించినవారి సంఖ్య 88కి చేరుకుంది. మహారాష్ట్రలో అత్యధికంగా 46 మంది స్వైన ఫ్లూ వల్ల మరణించారు. ఆ తర్వాతి స్థానం కర్నాటక ఆక్రమించింది. కర్నాటకలో స్వైన్ ఫ్లూ వల్ల 20 మంది మృతి చెందారు.