హైదరాబాదులో వైయస్ పార్థివ శరీరం

బేగంపేట విమానాశ్రయం నుంచి సిఎం క్యాంప్ కార్యాలయం వరకు రోడ్డుకు ఇరు వైపులా ప్రజలు బారులు తీరారు. ముఖ్యమంత్రిని చివరిసారి చూడడానికి పెద్ద యెత్తున ప్రజలు సిఎం క్యాంపు కార్యాలయం వద్ద గంటల తరబడి వేచి ఉన్నారు. ప్రజల సందర్శనార్థం శుక్రవారం ఉదయం లాల్ బహదూర్ స్టేడియంలో ఆయన భౌతిక కాయాన్ని ఉంచుతున్నట్లు చెప్పినా ప్రజలు వెళ్లిపోలేదు. ప్రభుత్వాధికారులు, మంత్రులు, శాసనసభ్యులు క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ప్రభుత్వ ప్రతినిధులు వైయస్ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. వైయస్ అమర్ రహే అంటూ అభిమానులు నినాదాలు చేశారు.












Click it and Unblock the Notifications