హైదరాబాద్ : ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నుంచి తానెంతో నేర్చుకున్నానని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ అన్నారు. వైఎస్‌కు నివాళులు అర్పించిన తర్వాత అక్కడ ఉన్న పుస్తకంలో సంతాప తీర్మాన సందేశాన్ని రాశారు. పేదల జీవితాలను మెరుగుపరచాలనుకునేవారికి వైఎస్ ఆదర్శమని ఆయన తీర్మానాంలో పేర్కొన్నారు.సోనియాగాంధీ ఆ డైరీలో అనేక విషయాలు, చాలా సేపు రాశారు. ఆ వివరాలు ఇంకా వెల్లడి కావలసి ఉంది.