హైదరాబాద్ : రాష్ట్ర ప్రజల బాగోగుల కోసం అవిశ్రాంతంగా కృషి చేసిన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సేవలు మరవలేనివని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అన్నారు. ఈ రోజు ఉదయం ఆమె క్యాంప్ కార్యాలయంలో వైఎస్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన అనంతరం సంతాప సందేశాన్ని రాశారు.
అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి రాత్రింబవళ్లు చేసిన కృషి ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని ఆమె తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.వైఎస్ బాలల సంక్షేమం, మహిళా సాధికారిత, పేదలు, రైతుల కోసం పాటుపడ్డారన్నారు.