దుఖ్కం దిగమింగుతూ, చేతులు జోడించి...

YS Rajasekhar Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి భౌతిక కాయాన్ని శుక్రవారం ఉదయం కాంగ్రెసు పార్టీ కార్యాలయం గాంధీ భవన్ కు తరలించే సమయంలో ఆయన కుమారుడు శోకమూర్తిలా కనిపించారు. వైయస్ భౌతిక కాయాన్ని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి పార్టీ కార్యాలయం గాంధీ భవన్ కు సైనిక వాహనంలో ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఈ సమయంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి వాహనంపై నించుని దారి పొడుగునా నించున్న ప్రజలకు రెండు చేతులు జోడించి అభివాదం చేస్తూ కనిపించారు.

ఆయన బలవంతాన దుఖాన్ని దిగమింగుకుంటన్నట్లు ఆయన ముఖం పట్టిస్తోంది. దారిపొడుగునా ప్రజలు వైయస్ భౌతిక కాయంపై పూలు కురిపిస్తూ నివాళులర్పించారు. వాహనంపై మాజీ క్రికెటర్, పార్లమెంటు సభ్యుడు అజరుద్దీన్, వైయస్ వ్యక్తిగత సహాయకుడు సూరీడు, వైద్య ఆరోగ్య మంత్రి దానం నాగేందర్, వైయస్ సన్నిహిత మిత్రుడు కెవిపి రామచందర్ రావు ఉన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి గాంధీభవన్ కు వైయస్ భౌతిక కాయం చేరడానికి గంటల సమయం పట్టింది. గాంధీ భవన్ నుంచి ఆయన భౌతిక కాయాన్ని ఎల్బీ స్టేడియానికి తరలిస్తారు. ఎల్బీ స్టేడియంలో వైయస్ ను చివరి సారి చూడడానికి ఇప్పటికే వేలాది మంది గుమికూడి ఉన్నారు. తొక్కిసలాటలో ఒక కానిస్టేబుల్ స్పృహ తప్పి పడిపోయాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+