ఇస్లామాబాద్: జిన్నా- ఇండియా, పార్టీషన్, ఇండిపెండెన్స్ అనే తన పుస్తకం ప్రచారం కోసం పాకిస్తాన్ ను సందర్శించడానికి భారత ప్రభుత్వం బిజెపి బహిష్కృత నేత జస్వంత్ సింగ్ కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నెల 26వ తేదీన జస్వంత్ పాకిస్తాన్ వస్తారని మీడియా కథనం. ఆయన 26వ తేదీన కరాచీ వచ్చి మర్నాడు ఇస్లామాబాద్ లోని ప్రెస్ క్లబ్ లో తన పుస్తకాన్ని ఆవిష్కరిస్తారని మీడియా తెలిపింది.
ఇస్లామాబాద్ లోని మిస్టర్ బుక్స్ యజమాని, ప్రముఖ పాకిస్తానీ ప్రచురణ కర్త ముహమ్మద్ యూసుఫ్ ఆహ్వానం మేరకు జస్వంత్ సింగ్ పాకిస్తాన్ పర్యటిస్తున్నారు. జస్వంత్ సింగ్ కు సెక్యూరిటీ క్లియరెన్స్ ను భారత ప్రభుత్వం ఇచ్చింది.