రాహుల్ ను ప్రధాని చేద్దాం: జగన్

YS Jagan
హైదరాబాద్: 2014 ఎన్నికల్లో రాష్ట్రం నుంచి అత్యధిక మంది పార్లమెంటు సభ్యులను పంపి కాంగ్రెసు నేత రాహుల్ గాంధీని ప్రధానిని చేద్దామని పార్లమెంటు సభ్యుడు, దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. టెక్కలి శాసనసభా నియోజక వర్గానికి జరుగుతున్న ఉప ఎన్నిక ఫలితం అందుకు పునాది కావాలని ఆయన అన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన చేశారు. టెక్కలి ఉప ఎన్నికలో కాంగ్రెసు పార్టీని గెలిపించాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. టెక్కలిలోనే కాదు, శ్రీకాకుళం జిల్లాలోనే కాదు, రాష్ట్రవ్యాప్తంగా 2014 ఎన్నికల్లో కాంగ్రెసుకు తిరుగు లేని విజయం సాధించి పెట్టి రాహుల్ గాంధీని ప్రధానిని చేద్దామని, తద్వారా తమ ప్రియతమ నాయకుడు వైయస్ రాజశేఖర రెడ్డి లక్ష్యాన్ని నెరవేరుద్దామని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో 2014 ఎన్నికల్లో 270 శాసనసభా స్థానాలు, 41 పార్లమెంటు స్థానాలు గెలుచుకుందామని, తద్వారా యువ నేత రాహుల్ గాంధీని ప్రధానిని చేద్దామని వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారని, వైయస్ లక్ష్యాన్ని మనం నెరవేరుద్దామని ఆయన అన్నారు. ఆ చివరి మాటను సాధించడానికి వైయస్ ఉన్నా లేకున్నా మనం నిలబెట్టుకుందామని ఆయన ప్రజలను ఉద్దేశించి అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి జ్ఞాపకంగా యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాంగ్రెసు పార్టీకి 2014 ఎన్నికల్లో కానుకగా ఇద్దామని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+