వైయస్ జగన్ కు మూడు ఆఫర్లు

ముఖ్యమంత్రి రోశయ్యకు మంత్రులు సహకరించకపోవడంపై పార్టీ అధిష్ఠాన వర్గం సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కె. రోశయ్యకు మంత్రులు, శాసనసభ్యులు పూర్తిగా సహకరిస్తారని గురువారం కెవిపి పార్టీ అధిష్ఠాన వర్గానికి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. తాను శుక్రవారం హైదరాబాద్ వెళ్తున్నానని, శనివారం తిరిగి ఢిల్లీ వస్తానని, ఈ విషయం చెప్పడానికి తాను అహ్మద్ పటేల్ ను కలిశానని కెవిపి గురువారం రాత్రి మీడియా ప్రతినిధులతో చెప్పారు.
అయితే జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలనే ప్రచారం మాత్రం ఆగలేదు. రాష్ట్ర పార్లమెంటు సభ్యులు కేంద్ర ప్రణబ్ ముఖర్జీని కలిశారు. జగన్ ను ముఖ్యమంత్రిని చేయడానికి పార్టీ అధిష్ఠాన వర్గం సుముఖంగా ఉందని ఎంపీ సాయిప్రతాప్ చెప్పారు.












Click it and Unblock the Notifications