హైదరాబాద్: తెలుగుదేశం శాసనసభ్యుడు పరిటాల రవి హత్య కేసులో నిందితుడు మద్దెలచెర్వు సూర్యానారయణ రెడ్డి అలియాస్ సూరిని హైదరాబాదులోని నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్)కు తరలించారు. అస్వస్థతకు గురి కావడంతో శుక్రవారం ఉదయం అతన్ని నిమ్స్ కు తరలించారు.గత కొంత కాలంగా సూరి వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. శుక్రవారం ఉదయం నొప్పి తీవ్రం కావడంతో అతన్ని నిమ్స్ కు తరలించాలని నిర్ణయం తీసుకున్నారు.
గతంలో కూడా మద్దెలచెర్వు సూరని నిమ్స్ కు తరలించారు. నిమ్స్ లో చికిత్స ఇప్పించిన తర్వాత అతన్ని తిరిగి అనంతపురం జైలుకు తరలించారు. ప్రస్తుతం అతను అనంతపురం జైలులో ఉంటున్నాడు.