హైదరాబాద్: హైదరాబాదులో స్వైన్ ఫ్లూ వ్యాధికి మరొకరు బలయ్యారు. హైదరాబాదులో స్వైన్ ఫ్లూ మృతులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా హైదరాబాదులోని రాంనగర్ కు చెందిన 40 ఏళ్ల రాజబాబు అనే వ్యక్తి స్వైన్ ఫ్లూ వ్యాధితో మరణించాడు. అయితే వైద్యుల నిర్లక్ష్యం వల్లనే రాజబాబు మరణించాడని అతని బంధువులు ఆరోపిస్తున్నారు.