ముంబై: కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ విమానం మంగళవారంనాడు అత్యవసరంగా ముంబై విమానాశ్రయంలో దిగింది. ఐటి 103 విమానం బెంగుళూర్ నుంచి బయలుదేరింది. ల్యాండింగ్ గియర్ సరిగా పనిచేయకపోవడంతో ఆ విమానం ముంబైలో అత్యవసరంగా దిగింది. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. వివరాలు తెలియాల్సి ఉంది.