మీడియాకు రఘువీరా హెచ్చరికలు

Raghuveera Reddy
హైదరాబాద్: మీడియాకు రాష్ట్ర వ్యవసాయ మంత్రి ఎన్. రఘువీరా రెడ్డి ఆదివారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెసు పార్టీకి, వైయస్ జగన్ కు వ్యతిరేకంగా కొన్ని పత్రికలు కుట్రపూరితంగా వార్తలు రాస్తున్నాయని, ఇంటర్నెట్ పత్రికల్లో కూడా వార్తాకథనాలు రాస్తున్నాయని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. తమకు పెద్ద దిక్కు ప్రస్తుత ముఖ్యమంత్రి కె. రోశయ్య అని ఆయన అన్నారు. రోశయ్య ముఖ్యమంత్రి అయినా, మరొకరు ముఖ్యమంత్రి అయినా కాంగ్రెసు పార్టీ కలిసికట్టుగా ఉంటుందని, ఎవరూ కలతలు సృష్టించలేరని ఆయన అన్నారు. రోశయ్యకు మంత్రులు సహకరించడం లేదని తప్పుడు వార్తలు రాశాయని ఆయన అన్నారు. సీనియర్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తమను కూర్చోబెట్టుకుని మీడియాకు వివరణ ఇచ్చినా తప్పుడు వార్తలు రాయడం మానలేదని ఆయన అన్నారు.

ఎన్ని వార్తలు రాసినా ప్రజల అభిప్రాయాన్ని మార్చలేరని ఆయన అన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని ఆయన అన్నారు. తాము తమ అభిప్రాయాన్ని కాంగ్రెసు పార్టీ అధిష్ఠాన వర్గానికి వినిపించామని, అధిష్ఠాన వర్గం నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. పార్టీ అధిష్ఠాన వర్గం నుంచి వెంటనే నిర్ణయం వస్తుందని ఆశించడం సరి కాదని ఆయన అన్నారు. వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని తాము ప్రయత్నాలు చేస్తున్నామని, తమ ప్రయత్నాలకు కూడా పరిమితులున్నాయని ఆయన అన్నారు. ప్రజాభిప్రాయాన్ని పార్టీ అధిష్ఠాన వర్గానికి వినిపించడం తమ బాధ్యత అని, అదే పని చేశామని ఆయన చెప్పారు. తాము తమ నాయకుడు వైయస్ పోయిన షాక్ నుంచి తేరుకోక ముందే తప్పుడు కథనాలు రాయడం మీడియా ప్రారంభించిందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+