జగన్ సిఎం కావాలి: రామానాయుడు

ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు, స్వర్గీయ ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి కూడా కెవిపి రామచందర్ రావును కలుసుకున్నారు. జగన్ ముఖ్యమంత్రి పదవి అర్హుడని ఆమె అన్నారు. జగన్ ను ముఖ్యమంత్రిగా నియమించడంలో కాంగ్రెసు అధిష్ఠాన వర్గం ఎందుకు జాప్యం చేస్తోందో తెలియడం లేదని ఆమె అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను కొనసాగించగలిగే నాయకుడు జగన్ తప్ప మరొకరు లేరని ఆమె అభిప్రాయపడ్డారు. మెజారిటీ ప్రజలు జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని ఆమె అన్నారు. రాష్ట్రంలోని 63 శాతం మంది ప్రజలు జగన్ సిఎం కావాలని కోరుకుంటున్నట్లు సర్వేలో కూడా వెల్లడైందని లక్ష్మీపార్వతి అన్నారు.












Click it and Unblock the Notifications