హైదరాబాద్: దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని పార్టీ సీనియర్లు కోరుకుంటున్నారని కాంగ్రెసు సీనియర్ నేత ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి చెప్పారు. ఆయన ఆదివారంనాడు రాజ్యసభ సభ్యుడు, వైయస్ రాజశేఖర రెడ్డి ఆత్మీయ మిత్రుడు కెవిపి రామచందర్ రావును కలిశారు. అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. జగన్ ను ముఖ్యమంత్రి చేయాలనే విషయంలో ఇప్పటికే తన అభిప్రాయాన్ని చెప్పానని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి ఎంపికలో పార్టీ అధిష్ఠాన వర్గం ఎందుకు జాప్యం చేస్తోందో తెలియడం లేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పీ) సమావేశం ఏర్పాటులో జాప్యం చేస్తే కార్యకర్తలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆయన అన్నారు.