రాజకీయం కేంద్రంగా కేశవరావు

కేశవరావు సీనియర్ కాంగ్రెసు శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డితో పాటు మంత్రులు వట్టి వసంత కుమార్, బొత్సా సత్యనారాయణ సోమవారం కలుసుకున్నారు. వట్టి వసంత కుమార్, బొత్సా సత్యనారాయణ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితులు కావడం ఇక్కడ గమనార్హం. అలాగే మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెసు శాసనసభ్యుడు కె. జానారెడ్డి కూడా కేశవరావుతో సమావేశమయ్యారు. పార్టీ నేతలు తులసిరెడ్డి, కోదండరెడ్డి వంటివారు కూడా కేశవరావును కలుసుకున్నారు. తమ భేటీకి ప్రత్యేకంగా ప్రాధాన్యం లేదని వారు చెబుతున్నారు. అయితే నాయకులు కలుసుకున్నప్పుడు రాజకీయాలు చర్చకు రావడం పరిపాటి అని వారు వ్యాఖ్యానిస్తున్నారు. అంతకు మించి వారు మీడియాతో మాట్లాడడం లేదు.












Click it and Unblock the Notifications