జగన్ సిఎం అయినా సరే: టిడిపి

ఎవరు ముఖ్యమంత్రి అనేది తమకు సంబంధించిన అంశం కాదని, అది కాంగ్రెసు పార్టీ ఆంతరంగిక వ్యవహారమని తెలుగుదేశం నాయకులు కె. ఎర్రంనాయుడు, యనమల రామకృష్ణుడు అన్నారు. తెలుగుదేశం రాజకీయం చేస్తోందని కాంగ్రెసు చేసిన విమర్శలను వారు ఖండించారు. కాంగ్రెసు పార్టీయే శవరాజకీయాలు చేస్తోందని, వైయస్ రాజశేఖర రెడ్డి భౌతిక కాయం అక్కడ ఉండగానే తమకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెసు నాయకులు ప్రజారాజ్యం అధినేత చిరంజీవిని కలిశారని వారన్నారు. తమను ఆ బురదలోకి లాగవద్దని వారు కాంగ్రెసు పార్టీకి సూచించారు. ప్రజలు కష్టాలు పడుతుంటే రాజకీయాల్లో మంత్రులు మునిగితేలుతున్నారని, ప్రజల కష్టాలు పట్టించుకోవాలని తాము మంత్రులను కోరుతున్నామని వారన్నారు.












Click it and Unblock the Notifications