హైదరాబాద్: స్వైన్ ఫ్లూ వ్యాధి హైదరాబాదులో రోజు రోజుకూ ప్రమాదకరంగా పరిణమిస్తోంది. ప్రతి రోజు ఈ వ్యాధికి బలవుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా మంగళవారం మరో మహిళ మరణించింది. కడప జిల్లా రాయచోటికి చెందిన మహిళ తాజాగా స్వైన్ ఫ్లూ వ్యాధికి బలైంది. దీంతో రాష్ట్రంలో స్వైన్ ప్లూ వల్ల మరణించినవారి సంఖ్య 36కు చేరుకుంది.
మంగళవారం ఉదయం హైదరాబాదులోని ఎల్బీనగర్ లో గల గ్లోబల్ అవేర్ అస్పత్రిలో విజయ అనే 50 ఏళ్ల మహిళ మరణించిన విషయం తెలిసిందే. ఈమె హైదరాబాదులోని వనస్థలిపురానికి చెందింది.