రాజీవ్ గాంధీ కిల్లర్ నిరాహార దీక్ష

ఆమెకు విధించిన మరణశిక్షను నిరుడు జీవిత ఖైదుగా మార్చారు. ఆమె ఇప్పటి వరకు 18 ఏళ్ల పాటు జైలులో ఉంది. సోమవారం ఉదయం నుంచి ఆహారం తీసుకోవడానికి నళిని నిరాకరిస్తున్నట్లు జైలు వర్గాలు చెప్పాయి. తన విడుదలకు సంబంధించి హైకోర్టు ఆదేశాలను అమలు చేసేవరకు తన ఆమరణ నిరాహార దీక్ష సాగుతుందని ఆమె అంటోంది. బోర్డును సరిగా ఏర్పాటు చేయనందున దాన్ని పునర్వ్యస్థీకరించాలని హైకోర్టు నిరుడు ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రభుత్వం అందుకు చర్యలు తీసుకోవడం లేదు. నళిని ఇటీవలే ఇందిరా గాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ అప్లికేషన్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసింది.












Click it and Unblock the Notifications