క్యాన్సరే అతన్ని పట్టిచ్చింది

Kobad Ghandy
న్యూఢిల్లీ: క్యాన్సర్ వ్యాధి వల్లనే మావోయిస్టు నేత కోబాడ్ గాంధీ పోలీసులకు చిక్కినట్లు భావిస్తున్నారు. ఒక వేళ అదే లేకపోతే ఆయనను పట్టుకోవడం అంత సులభం కాదని అంటున్నారు. క్యాన్సర్ వ్యాధి వల్ల అతను ఢిల్లీకి రావాల్సి వచ్చిందని, సమాచారం తెలిసిన పోలీసులు అతి వేగంగా కదిలి అతన్ని పట్టుకున్నారని చెబుతున్నారు. జూన్ లో తమకు దొరికిన 14 పేజీల మావోయిస్టుల డాక్యుమెంట్ ఆధారంగా పోలీసులు అతని కోసం వేట సాగిస్తున్నారు. కోబాడ్ గాంధీని పోలీసులు ఇటీవల ఢిల్లీలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

జార్ఖండ్ లో అరెస్టయిన ఒక మావోయిస్టు నేత లాప్ టాప్ నుంచి డాక్యుమెంటును స్వాధీనం చేసుకున్న పోలీసులు గాంధీ ఆచూకీ కోసం మనుషులను నియోగించడమే కాకుండా టెలికం, ఇంటర్నెట్ కమ్యూనికేషన్ నెట్ వర్కును వాడుకున్నారు. దాంతో వారు గాంధీని పట్టుకోగలిగారు. గత రెండు నెలలుగా ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ పోలీసులు గాంధీ కదలికలపై నిఘా పెట్టారు. పోలీసులు అతన్ని ఇంతకు ముందే అరెస్టు చేసి ఉండేవారు. అయితే అతని నెట్ వర్కును ఛేదించే ఉద్దేశంతో ఆగారు.

మావోయిస్టుల ప్రచార విభాగం ఇంచార్జీ అయిన గాంధీకి ఢిల్లీలోని ఒక ఆస్పత్రిలో క్యాన్సర్ కు,గుండె సంబంధమైన సమస్యలకు చికిత్స జరుగుతోంది. గాంధీ ముంబైలోని సంపన్నమైన పార్సీ కుటుంబానికి చెందినవాడు. 1970 తొలి నాళ్లలో అతను నక్సలైట్ ఉద్యమంలోకి వెళ్లాడు. అతను డూన్ స్కూల్లో చదువుకున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+