వరంగల్: అమెరికాలోని బోస్టన్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన భార్యాభర్తలు దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. హన్మకొండకు చెందిన రామిరెడ్డి, భాగ్యలక్ష్మి దంపతులు ప్రమాదంలో మరణించారు. ఆమెరికాలో ఉన్న తమ కుమారుడి వద్దకు నాలుగు రోజుల క్రితమే వెళ్లారు. ప్రమాదంలో వారి కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు.వారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. అనంతరం వెంటనే బావిలో పడింది. దీంతో ప్రమాదం సంభవించింది.