రాష్ట్ర నేతలపై మొయిలీ ఆగ్రహం

రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ గత నాలుగు రోజులుగా సభ్యత్వ నమోదుపై పార్టీ కార్యాలయం గాంధీ భవన్ నుంచి జిల్లా నేతలతో టెలీ కాన్ఫరెన్స్ లు నిర్వహిస్తున్నారు. అయితే ఈ టెలీ కాన్ఫరెన్స్ లను వైయస్ జగన్ వర్గీయులు పలు చోట్ల అడ్డుకున్నారు. జగన్ ను ముఖ్యమంత్రిని చేసే వరకు సభ్యత్వ నమోదు చేయలేమని పలువురు నాయకులు చెబుతున్నారు. దీంతో మొయిలీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో పరిస్థితిలు చక్కబడిన తర్వాత సభ్యత్వ నమోదు చేయిస్తే బాగుంటుందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications