ఖాట్మండు: తూర్పు నేపాల్ లోని ఓ చర్చి కూలడంతో బుధవారం తెల్లవారు జామున 24 మంది మరణించారు. దాదాపు 62 మంది గాయపడ్డారు. వారంపాటు సమావేశానికి ధరన్ పట్టణంలో ప్రజలు పెద్ద యెత్తున వచ్చారు. రాత్రి వారు వెదురుతో నిర్మించిన చర్చి విస్తరణ భాగంలో నిద్రించారు. అది రాత్రి కూలిపోయింది.
ఆ ప్రదేశం నేపాల్ రాజధాని ఖాట్మండు 400 కిలోమీటర్ల దూరంలో ఉంది. మృతుల్లో 17 మంది మహిళలు, నలుగురు పిల్లలు ఉన్నారు. సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వారిని బిపి కొయిరాల వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు.