నల్లగొండ: నల్లగొండ జిల్లా దామచర్ల మండలం వాడపల్లిలోని ప్రసిద్ధ మీనాక్షి దేవాలయంలోకి వరద నీరు చొచ్చుకొచ్చింది. దీనితో ఆలయంలోని ఉత్సవ మూర్తులను సురక్షిత ప్రదేశానికి తరలించాలని వేద పండితులు నిర్ణయించారు. సాగర్ నుంచి వచ్చే నీటి ఉద్ధృతి మరింత పెరగడంతో వాడపల్లి వారధిపై ఇప్పటికే భారీ వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఇప్పుడు ద్విచక్ర వాహనాలను కూడా నిరోధించాలని నిర్ణయించారు. ముందు జాగ్రత్త చర్యగా వాడపల్లి, పరిసర గ్రామ ప్రజలను పునరావాస శిబిరాలకు తరలించారు.