హైదరాబాద్ :సోనియా గాందీ రాష్ట్రంలో వరద పీడిత ప్రాంతాల్లో పర్యటించనున్నారని పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డి.ఎస్ మాట్లాడుతూ రాష్ర్టంలో వరదల వల్ల ఏర్పడిన నష్టాలను, ప్రస్తుత పరిస్థితుల గూర్చి వివరించామన్నారు. దీనిలో భాగంగా యూపీఎ చైర్‌పర్సన్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, కేంద్ర హోంమంత్రి చిదంబరం సోమవారం పర్యటించనున్నారని, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మంగళవారం పర్యటించనున్నట్లు డిఎస్ తెలిపారు.