భయం గుప్పిట్లో బెజవాడ

వరద ఉధృతికి బెజవాడ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఎప్పుడేం జరుగుతుందో తెలియక ప్రాణాలు ఉగ్గపట్టుకొని బిక్కుబిక్కుమంటున్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితి నుంచి గట్టెక్కించమంటూ పూజలు, యాగాలు చేస్తున్నారు.
పునరావాస కేంద్రాలకు ముంపు ప్రాంతాల ప్రజలను తరలించే విషయంలో పోలీసు, రెవిన్యూ అధికారులు అనుసరిస్తున్న వైఖరి కూడా ప్రజల్లో అనుమానాలను రేకెత్తిస్తోంది. పైగా ఆదివారం పౌర్ణమి కావడంతో సముద్రపు పోటు కారణంగా నీటి ఉధృతి మందగించి విజయవాడ పట్టణంలో కర్నూలు కంటే భయానక వాతావరణం నెలకొంటుందనే ఆందోళన బెజవాడ వాసులను బెంబేలెత్తిస్తుంది.












Click it and Unblock the Notifications