వరద మృతులు 52 మంది

Floods
హైదరాబాద్: రాష్ట్రంలో వరద తాకిడికి 52 మంది మరణించారు. వరద నీరు తగ్గుతున్న కొద్దీ మృతదేహాలు బయట పడుతున్నాయి. కర్నూలు, మంత్రాలయం, మహబూబ్ నగర్ జిల్లాల్లో వరద తగ్గింది. సోమవారం సాయంత్రం వరకు అందిన సమాచారం మేరకు రాష్ట్రంలో 52 మంది మరణించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కర్నూలు జిల్లాలో 28 మంది మరణించారు. కర్నూలు జిల్లాలో మరణాల సంఖ్య అధికంగా ఉంది.

ఇప్పటి వరకు 62,032 ఇళ్లు దెబ్బ తిన్నాయని ముఖ్యమంత్రి కె. రోశయ్య సోమవారం రాత్రి చెప్పారు. నాగార్జున సాగర్ నుంచి దిగువకు విడుదల చేస్తున్న నీటి వల్ల కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని గ్రామాలు అల్లకల్లోలమవుతున్నాయి. కృష్ణా జిల్లాలో 131 గ్రామాలను, గుంటూరు జిల్లాలో 110 గ్రామాలను వరదలు ముంచెత్తాయి. వరదల కారణంగా మొత్తం 565 గ్రామాలు నీటిలో చిక్కుకున్నాయి. 16.10 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. 10,534 పశువులు మరణించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+