ఎస్ ఎస్పీ యాదవ్ పై వేటు

ఇంటలిజెన్స్ చీఫ్ గా అరవిందరావు స్థానంలో మహేందర్ రెడ్డి నియమితులయ్యారు. అరవింద రావును అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) డైరెక్టర్ జనరల్ గా నియమితులయ్యారు. ఇటీవల వైయస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో విమర్శలు ఎదుర్కున్న అరవింద్ రావు తనను ఆ పదవి నుంచి తప్పించాలని కోరినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటి వరకు ఆర్టీసి ఎండిగా ఉన్న దినేష్ రెడ్డిని విజిలెన్స్, ఎన్ ఫోర్స్ మెంటే డిజిగా నియమించారు.
రాష్ట్రం వరద తాకిడికి గురై విలవిలలాడుతున్న సమయంలో కూడా డిజిపి ఎస్ఎస్పీ యాదవ్ కనిపించకుండా పోయారు. ఆయన ఏం చేస్తున్నారనేది ముఖ్యమంత్రికి కూడా తెలియని స్థితి వచ్చిందంటారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఎస్ఎస్పీ యాదవ్ మొదటి నుంచీ వివాదాలకు కేంద్రంగానే ఉన్నారు.












Click it and Unblock the Notifications