శాంతించిన కృష్ణమ్మ తల్లి

కృష్ణా నగరంలోని పలు బస్తీలతో పాటు జిల్లాలోని పలు గ్రామాలు ఇంకా నీటిలోనే మునిగి ఉన్నాయి. నాగాయలంక, పల్లె నాగాయలంక గ్రామాలు నీటిలోనే ఉన్నాయి. ఇబ్రహీం పట్నం మండలంలోని కొన్ని గ్రామాలు కూడా ఇంకా నీటిలోనే మునిగి ఉన్నాయి. అవనిగడ్డలోని పలు వార్డుల్లో వరద నీరు తొలగిపోలేదు.
వరద వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మంచినీటి కోసం, గుక్కెటు తిండి కోసం అల్లాడుతున్నారు. చుట్టూ నీరు ఉన్నా తాగేందుకు అది పనికి రావడం లేదు. దీంతో ఎక్కడెక్కడి నుంచో ప్రజలు నీరు తెచ్చుకుంటున్నారు. అయితే, కొత్తగా ప్రమాదం లేకపోవడం ప్రజలకు కొంత ఊరట కలిగించింది. కరకట్టలకు గండ్లు పడే ప్రమాదం ఉండడంతో తీవ్ర భయాందోళనలకు గురైన ప్రజలు పెద్ద ప్రమాదమేదీ సంభవించకుండానే బయటపడ్డారు.












Click it and Unblock the Notifications