ఖాళీగా ఉందని జగన్ అన్నాం: ఉప్పునూతల

KVP Ramachandar Rao
హైదరాబాద్: ముఖ్యమంత్రి పదవి ఖాళీగా ఉందని వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని అప్పుడు అన్నామని కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి అన్నారు. మంత్రులు జె. గీతారెడ్డి, వట్టి వసంతకుమార్, తదితర మంత్రులతో పాటు పురుషోత్తమ రెడ్డి గురువారం ప్రభుత్వ సలహాదారు, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావును కలిశారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి పదవి ఖాళీ లేదని కెవిపి రామచందర్ రావుతో భేటీ అనంతరం పురుషోత్తమ రెడ్డి మీడియా ప్రతినిధులతో అన్నారు.రోశయ్య ముఖ్యమంత్రిగా ఉండబోరని ఎందుకనుకోవాలని ఆయన ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి రోశయ్య అధికారులను బదిలీ చేయడంపై మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా అది ఆశ్చర్యపడే ఘటన ఏమీ కాదని అన్నారు. రోశయ్య ముఖ్యమంత్రిగా చేయాల్సిన పనులు చేసుకుంటూ పోతున్నారని ఆయన అన్నారు. అనుభవజ్ఞుడైన రోశయ్య తన పనులు తాను చేసుకుంటూ పోతున్నారని, పరిపాలనలో భాగంగానే బదిలీలు చేశారని ఆయన అన్నారు. మంత్రివర్గ విస్తరణ ఉండవచ్చునని, తేదీ ఏమీ చెప్పలేమని ఆయన అన్నారు. కెవిపి రామచందర్ రావును మర్యాదపూర్వకంగానే కలిశామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+