హైదరాబాద్: షామీర్‌పేట్ వద్ద చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు పలువురు గాయపడ్డారు. బస్సును కారు ఢీకొనడంతో ఈ దుర్ఘటన సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృత్యువాత చెందారు. సమాచారం అందుకున్న 108 సంఘటనా స్థలికి చేరుకొని గాయపడ్డవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.