విజయవాడ: వరద సహాయక చర్యలు పూర్తైన వెంటనే అసెంబ్లీని సమావేశ పరచాలని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా వరద బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొంటున్న చిరంజీవి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రాన్ని ముంచెత్తిన వరదలకు మానవ తప్పిదం కారణం అయితే ప్రభుత్వం తన తప్పును అంగీకరించాలన్నారు. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు పూర్తవ్వగానే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని చిరు అభిప్రాయపడ్డారు. పంట నష్ట పోయిన 5 జిల్లాల రైతులకు నష్ట పరిహారం అందించేందుకు ప్రత్యేక ప్యాకేజీ విడుదల చేయాలని పీఆర్పీ అధినేత డిమాండ్ చేశారు.