వైఎస్ మృతి మిస్టరీయే: ఎమ్మెల్సీ జూపూడి

YS Rajasekhar Reddy
హైదరాబాద్‌: డాక్టర్ వైఎస్‌ రాజశేఖరెడ్డి మరణంపై ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర రావు సంచలన వ్యాఖ్య లు చేశారు. వైఎస్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ కొండను ఢీ కొట్టలేదని దానిని కూల్చి వేశారన్నారు. వైఎస్‌ను హతామర్చేందుకు సెక్రటేరి యట్‌లోని కొందరు కుట్ర పన్నార న్నారని ఆరోపించారు. వైఎస్‌ అధికారంలో ఉంటే తమ ఆటలు సాగవని వారు ఈ దారుణానికి పూనుకున్నారన్నారు. అదను కోసం చూస్తున్న వారికి వైఎస్‌ పల్లె బాట కార్యక్రమం వరంలా పరణమించిందన్నారు.

పేదల కష్టాలను తీర్చేందుకు నడుం బిగించిన వైఎస్‌ను అంతంమెందించేందుకు కుట్రపన్నారని ఆయన ఆరోపించారు. నక్సల్స్‌ సంచరించే ప్రాంతమైన నల్లమల్లలో వైఎస్‌ను కడతేరిస్తే తమ అనుమానంరాదనే ఉద్ధేశంతో ఇంతకు తెగించారన్నారు. వైఎస్‌ జాడ తెలియకుండా పోయిన క్షణంలో అందరు నక్సల్స్‌పైనే అనుమానం వ్యక్తం చేశారని కాని వాస్తవంలో జరిగింది వేరొకటన్నారు. అయితే ఈ కుట్ర పన్నిన వారి పేర్లను సరైన సమయంలో వెల్లడిస్తామ న్నారు. వైఎస్‌ మరణంపై మళ్ళీసమగ్ర దర్యాప్తు నిర్వహించాలని, ఈ సంఘట నకు సెక్రటేరియట్‌లోని వారే బాధ్యత వహించాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+