అమర్ సింగ్ పై రూ. 500 కోట్ల ఫ్రాడ్ కేసు

అమర్ సింగ్, ఆయన భార్య 2003 - 2008 మధ్య కాలంలో వారి కంపెనీలను ఇతర సంస్థల్లో కలిపి రూ. 500 కోట్ల మేరకు డబ్బు చేసుకున్నారని శివకాంత్ తివారీ తన 14 పేజీల ఫిర్యాదులో ఆరోపించినట్లు కాన్పూర్ డిఐజీ నీరా రావత్ చెప్పారు. ఫిర్యాదులో సింగ్ దంపతులు నడిపే సంస్థలో, వారికి సొంత సంస్థలో అయిన ఎనర్జీ డెవలప్ మెంట్ కంపెనీ లిమిటెడ్, ఇడిసిఎల్ పవర్ లిమిటెడ్, పంకజా ఆర్ట్ అండ్ క్రెడిట్ లిమిటెడ్, సర్వోత్తమ్ క్యాప్ లిమిటెడ్, ఇడిసిఎల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, ఈస్టర్న్ ఇండియా కంపెనీలను పేర్కొన్నారు. చిన్న సంస్థలను ఈ కంపెనీల్లో విలీనం చేశారనేది శివకాంత్ తివారీ ఆరోపించారు. ఉదాహరణకు సర్వోత్తమ్ క్యాప్ లిమిటెడ్ లో 25 కంపెనీలను విలీనం చేసినట్లు అతను అన్నాడు.












Click it and Unblock the Notifications