మంత్రులు, అధికారులు భేష్: రోశయ్య

Rosaiah
హైదరాబాద్: వరద తాకిడి ప్రాంతాల్లో అధికారులు, మంత్రులు సమర్థంగా పని చేశారని ముఖ్యమంత్రి కె.రోశయ్య ప్రశంసించారు. ఆయన శుక్రవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద సాయం ప్రతి మారు మూల ప్రాంతానికి అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన కలెక్టర్లను ఆదేశించారు. వరద బాధితులు సత్వరమే కోలుకునేలా చర్యలు చేపట్టాలని కూడా ఆయన సూచించారు. ఈ నెల 28వ తేదీన జరిగే కల్యాణమస్తుపై, వరద సహాయక చర్యలపై ఆయన జిల్లా కలెక్టర్లతో మాట్లాడారు.

వరద బాధితుల కోసం లక్ష ఇళ్లు నిర్మించి ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. స్వచ్ఛంద సంస్థల సహాయం బాధితులకు అందేలా చూడాలని ఆయన సూచించారు. స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం తీసుకుని నష్టపరిహారం ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. వరద సహాయక చర్యలపై త్వరలో అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. రోశయ్య వీడియో కాన్ఫరెన్స్ కు మునుపటి కన్నా ఎక్కువగా 20 మంది మంత్రులు హాజరయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+