ఎవరూ నన్ను కాదనడం లేదు: సిఎం

మంత్రులు తనకు సహకరించడం లేదనే మాటలో నిజం లేదని, మంత్రులు ఎవరి పనులు వారు చేసుకుపోతున్నారని, కుటుంబంలో పెద్ద వాడిగా వారికి తాను తోడు ఉంటున్నానని ఆయన అన్నారు. తనకు వచ్చిన సమాచారం ప్రకారం వైయస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదం జరిగిందనేది ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డి విషయంలో కుట్ర జరిగి ఉంటే ఛేదించాల్సిన అవసరం ఉందని, వివిధ దర్యాప్తులు జరుగుతున్నాయని, విషయాలు తెలుస్తున్నాయని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి ఎవరనేది ముఖ్యం కాదని, విధానాలు ఎలా సాగుతున్నాయనేది ముఖ్యమని ఆయన అన్నారు. విధానాల అమలులో లోపాలు లేకుండా చూసుకోవడమే ముఖ్యమని ఆయన అన్నారు. ముఖ్యమంత్రిగా తాను ఉన్నా, అధిష్టానం మరొకరిని పెట్టినా కాంగ్రెసు లక్ష్యం వైయస్ రాజశేఖర రెడ్డి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడమేనని ఆయన అన్నారు.
తనకు ప్ర్తత్యేక ముద్ర లేదని, తనది కాంగ్రెసు ముద్ర అని, సోనియా ముద్ర అని ఆయన అన్నారు. పార్టీ అధిష్టానం చెప్పడం వల్లనే తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నానని ఆయన అన్నారు. రాజశేఖర రెడ్డిని మళ్లీ తేలేమని, ఉన్నవారిమి శక్తిమేరకు పని చేయాలని, అధికారులు సమస్యలు పరిష్కరించడానికి ముందుకు సాగుతున్నారని ఆయన తీవ్రవాదం, వేర్పాటువాద సమస్యలు పెచ్చరిల్లుతున్నాయని ఒక మీడియా ప్రతినిధి చేసిన వ్యాఖ్యకు సమాధానంగా చెప్పారు. హైదరాబాద్ ను ఫ్రీజోన్ గా ప్రకటించడంపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు. అఖిలపక్ష సమావేశంలోకి ఆగంతకుడి ప్రవేశంపై భద్రతా వైఫల్యమని అనుకోవడం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications