హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ తెలుగుదేశం శాసనసభ్యురాలు సుమన్ రాథోడ్ కు రాష్ట్ర హైకోర్టు నుంచి గురువారం తాత్కాలిక ఊరట లభించింది. సుమన్ రాథోడ్ ఎస్టీ కాదంటూ జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు సస్పెండ్ చేసింది. ఆ ఆదేశాల అమలును తాత్కాలికంగా నిలిపేసింది. దీంతో సుమన్ రాథోడ్ కు కాస్తా ఊరట లభించింది.
కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలపై సుమన్ రాథోడ్ హైకోర్టుకు వెళ్లారు. సుమన్ రాథోడ్ కుల నిర్ధారణపై ఒక విచారణ కమిటీని వేశారు. ఈ నివేదిక ఆధారంగా ఆమె కుల ధ్రువీకరణ పత్రాన్ని కలెక్టర్ రద్దు చేశారు. దీన్ని ఆమె హైకోర్టులో సవాల్ చేశారు.