హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉత్తమ నటుడు రవితేజ, ఉత్తమ చిత్రం గమ్యం

By Pratap
|
Google Oneindia TeluguNews

Nandi Awards
హైదరాబాద్: 2008కి గాను 14 మంది సభ్యులతో కూడిన కమిటీ చైర్మన్ తమ్మారెడ్డి భరద్వాజ శనివారం ప్రకటించారు. ఉత్తమ చిత్రంగా గమ్యం, ద్వితీయ ఉత్తమ చిత్రంగా వినాయకుడు, తృతీయ ఉత్తమ చిత్రంగా పరుగు ఎంపికయ్యాయి. ఉత్తమ నటుడిగా నేనింతే సినిమాలో నటనకు గాను రవితేజకు దక్కింది. ఉత్తమ నటి అవార్డు అష్టా చెమ్మాలో ప్రదర్సించిన నటనకుగాను స్వాతికి దక్కింది. ఉత్తమ హాస్యనటుడిగా బ్రహ్మానందం ఎంపికయ్యారు. ఉత్తమ హాస్యనటి అవార్డు ఎవరికీ దక్కలేదు. మొత్తం 65 విభాగాల్లో అవార్డులను ప్రకటించారు.

ఉత్తమ ప్రతినాయకుడి అవార్డు అరుంధతి సినిమాలో నటనకు గాను సోనూ సూద్ కు దక్కింది. ఉత్తమ దర్శకుడి అవార్డు గమ్యం సినిమాకు గాను రాధాకృష్ణ జాగర్లమూడికి దక్కింది. ఉత్తమ సహాయ నటి అవార్డు నచ్చావులే సినిమాలో నటనకు గాను రక్షకు దక్కింది. ఉత్తమ సహాన నటుడి అవార్డు గమ్యం సినిమాలో నటనకుగాను అల్లరి నరేష్ కు దక్కింది. ఉత్తమ సంగీత దర్శకుడిగా కొత్త బంగారు లోకం గాను మికీ మేజయర్ కు లభించింది. ఉత్తమ సినిమటో గ్రఫీ అవార్డు కూడా అదే సినిమాకు దక్కింది. చోటా కె నాయుడు ఉత్తమ సినిమటో గ్రాఫర్ గా ఎంపికయ్యారు.

ఉత్తమ గేయ రచయితగా సిరివెన్నెల సీతారామశాస్త్రికి నంది అవార్డు దక్కింది.ఉత్తమ నేపథ్య గాయకుడి అవార్డు శంకర్ మహదేవన్ కు, ఉత్తమ నేపథ్య గాయని అవార్డు గీతా మాధురికి దక్కాయి. ఉత్తమ బాలనటుడి అవార్డు నేనింతే చిత్రంలో నటనకుగాను మాస్టర్ భరత్ కు దక్కింది. అరుంధతి సినిమాలో నటనకుగాను అనుష్కకు, పరుగు చిత్రంలో నటనకు గాను అల్లు అర్జున్ కు ప్రత్యేక జ్యూరీ అవార్డులు లభించాయి. ఉత్తమ జాతీయ సమగ్రతా అవార్డు 1940లో ఒక గ్రామం చిత్రానికి దక్కింది. ఉత్తమ సంభాషణల రచయితగా పూరీ జగన్నాథ్ కు, ఉత్తమ కథ అవార్డు ఆర్పీ పట్నాయక్ కు నంది అవార్డులు లభించాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X