గ్రేటర్ లో అన్ని స్ధానాలకూ పోటీ: చిరంజీవి

వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రరాపా అధినేత చిరంజీవి విమర్శించారు. వరద బాధితుల్లో ప్రభుత్వం భరోసా కల్పించలేకపోతోందని అన్నారు. వరద బాధిత ప్రాంత ప్రజల సహాయార్థం నగరంలో పార్టీ చేపట్టిన ప్రరాపా విరాళాల సేకరణ కార్యక్రమానికి వెళ్లే ముందు చిరంజీవి మీడియాతో మాట్లాడారు. నాలుగు జిల్లాల్లో వరదలొస్తేనే ప్రజలను ఆదుకోవడంలో విఫలమైన ప్రభుత్వం..భవిష్యత్‌లో రాష్ట్రవ్యాప్తంగా వైపరిత్యాలు వస్తే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications