హైదరాబాద్: ప్రజారాజ్యం మాజీ నేత, మాజీ ఐఎఎస్ అధికారి కేఎస్‌ఆర్ మూర్తి కాంగ్రెస్‌లో చేరనున్నారు. పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ తో ఆయన సమావేశమై పార్టీలో చేరికపై చర్చించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ నవంబర్ ఒకటిన కాంగ్రెస్‌లో చేరనున్నట్టు తెలిపారు. ప్రజారాజ్యం ఆవిర్భావం నుంచి ఆయన ఆ పార్టీలో ఉన్నారు.
చిరంజీవికి గ్లామర్ ఉన్నప్పటికీ ప్రజారాజ్యాన్ని శక్తివంతమైన రాజకీయపక్షంగా తీర్చిదిద్దలేకపోయారని అన్నారు. ప్రజారాజ్యానికి తన రాజీనామాలేఖను పార్టీ అధినేత చిరంజీవికి ఫ్యాక్స్ ద్వారా పంపినట్టు తెలిపారు.