మావోయిస్టులకు విదేశీ ఆయుధాలు: చిదంబరం

చర్చలకు ముందస్తు షరతుగా ఆయుధాలు కింద పడేయాలని తాము చెప్పడం లేదని చిదంబరం అన్నారు. "హింసను ఆపాలని వారిని కోరడమంటే..రైల్వే ట్రాకులు, రోడ్లు, టెలిఫోన్ టవర్లు, పాఠశాల భవనాలు, వంతెనలను ధ్వంసం చేయడాన్ని, కిడ్నాప్‌లు, అక్రమ వసూళ్లను ఆపాలనడం" అని చెప్పారు. మావోయిస్టులకు మద్దతుగా నిలిచిన మేధావులపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఆయుధాలు, డబ్బు కోసమే తాము బెంగాల్‌లోని పోలీస్ స్టేషన్ పై దాడి చేసినట్లు మావోయిస్టులు ప్రకటించిన అంశాన్ని ఆయన గుర్తు చేస్తూ...ఈ ప్రకటన తర్వాత కూడా ఎవరైనా నక్సలైట్ల అంశాన్ని గోరంతలు కొండంతలు చేయాలనుకుంటే వారిని దేవుడే కాపాడాలని అన్నారు.
మావోయిస్టు మహిళా ఖైదీల విడుదల అంశంలో బెంగాల్ ప్రభుత్వ వైఖరిపై తాను ఎక్కువగా మాట్లాడదల్చుకోలేదని అన్నారు. మావోయిస్టులకు పాక్ నుంచి ఆయుధాలు అందుతున్నాయా? అన్న ప్రశ్నకు..కచ్చితంగా చెప్పలేమని అన్నారు. విదేశాల్లో మావోయిస్టులకు మద్దతిచ్చే సంస్థలు ఉన్నాయా? అన్న ప్రశ్నకు...తనకు తెలియదని జవాబిచ్చారు. అయితే కొందరు మేధావులు వారికి మద్దతు ఇచ్చే అవకాశాలు లేకపోలేదని అన్నారు. మావోయిస్టులతో నెలకొన్న సందిగ్ధాన్ని తొలగించి..వారిని చర్చలకు అంగీకరింప చేసేందుకు 'విభిన్నమైన ఆలోచన' ఏమైనా చేస్తున్నారా? అన్న ప్రశ్నకు.. "ఎలాంటి సందిగ్ధం లేదు. వామపక్ష తీవ్రవాదం గురించి లేనిపోని ఊహాగానాలు చేస్తున్న వారే సందిగ్ధం ఉందని అంటున్నారు" అన్నారు.
-
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్












Click it and Unblock the Notifications