వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెసీఆర్ నోట రక్తపాతం మాట

By Santaram
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
వరంగల్: ఎన్ని ప్రాణాలు పోయినా, తలలు తెగిపడినా తెలంగాణ ఉద్యమం ఆగదని తెరాస అధినేత కె చంద్రశేఖరరావు స్పష్టం చేశారు.ఎవరు ఎన్నిరకాలుగా ఉద్యమాన్ని అణచి వేయాలని చూసినా, ఎత్తులు, జిత్తులు వేసినా ప్రత్యేక రాష్ట్ర సాధనను ఎవరూ అడ్డుకోలేరని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనే తమ అంతిమ లక్ష్యమని కెసీఆర్ పునరుద్ఘటించారు. త్వరలో నిర్వహించబోయే జైల్‌భరో కార్యక్రమం గురించి ఆయన శనివారం వరంగల్‌కు వచ్చారు. ఈ సందర్భంగా వివిధ ఉద్యోగ సంఘాలతో సదస్సు నిర్వహించారు. కాకతీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ దినేష్‌ సమావేశానికి అధ్యక్షత వహించగా, ప్రత్యేక ఆహ్వానితులుగా తెలంగాణ సిద్దాంతకర్త కొత్తపల్లి జయశంకర్‌, ముఖ్య అతిథిగా కెసిఆర్‌ హాజరయ్యారు.

ఫ్రీజోన్‌ వల్ల తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను కెసీఆర్ ఏకరువు పెట్టారు. నవంబర్‌ 4వ తేదీ లోపు ప్రజాస్వామ్య బద్దంగా ఫ్రీజోన్‌ అంశాన్ని రాజ్యాంగ సవరణ చేసి రద్దు చేయాలని, అలా చేయకపోతే అది రద్దయ్యే వరకు తెలంగాణ ప్రాంతంలోని ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు, మేధావులు, నిరుద్యోగులు, తెలంగా ణ వాదులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారని ప్రభుత్వా న్ని హెచ్చరించారు. అవసరమైతే ప్రపంచ దేశాల్లోని తెలంగాణ ప్రాంతానికి చెందిన విద్యార్థులు, ఉద్యోగుల నుండి లక్షల కోట్ల ఆర్థిక సహాయాన్ని ఆర్థించి ఉద్యమాన్ని కాపాడు కుంటామని కెసిఆర్‌ స్పష్టం చేసారు. తెలం గాణ ప్రత్యేక రాష్ర్టం వచ్చే దాకా తమ పోరాటం ఆగదని ప్రత్యేక రాష్ర్టంతోనే హక్కులు సిద్ది స్తాయన్నారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్‌ శాసనసభా పక్ష నేత ఈటల రాజేందర్‌, మాజీ మంత్రులు హరీష్‌ రావు , కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు, గుండె విజయరామారావు, మాజీ ఎంపి బోయినపల్లి వినోద్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X