హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రోశయ్య వైపు ప్లేటు ఫిరాయింపు

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.రోశయ్యకు రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది. కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వర్గీయులు ఒక్కరొక్కరే ప్లేటు ఫిరాయిస్తున్నారు. పార్టీ అధిష్టానం మనోగతం స్పష్టం అవుతుండడంతో చాలా మంది మంత్రులు, నాయకులు రోశయ్యకు మద్దతు తెలపడానికి ముందుకు వస్తున్నారు. కొండా సురేఖ వంటి హార్డ్ కోర్ జగన్ మద్దతుదారులు కూడా మెత్తబడ్డారు. జగన్ ను ముఖ్యమంత్రిని చేయకపోతే రాజీనామా చేస్తానని హెచ్చరించిన మహిళా శిశు సంక్షేమ మంత్రి కొండా సురేఖ తన మద్దతు పూర్తిగా రోశయ్యకు ఉంటుందని చెప్పారు. మంత్రులు కొంత మంది మొదట్లో జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలంటూ హెచ్చరికలు చేసే పద్ధతిలో మాట్లాడారు. క్రమక్రమంగా చల్లబడుతూ వచ్చారు.

జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలంటూ డిమాండ్ పెట్టిన కొంత మంది మంత్రులు తమది డిమాండ్ కాదు, కోరిక మాత్రమేనని చెప్పి సర్దుకునే ప్రయత్నం చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి ఎన్. రఘువీరా రెడ్డి రోశయ్య నాయకత్వంలో రైతులకు తాము చేరువ అవుతామని చెప్పి తన విధేయతను ప్రకటించుకునే ప్రయత్నం చేశారు. నిజానికి, మంత్రివర్గంలో చాలా మంది దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి అనుయాయులు. దీంతో కాంగ్రెసు పార్టీ అధిష్టానం మేరకు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన రోశయ్యను ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేశారు. పార్టీ శాసనసభ్యులు కొంత మంది రోశయ్యకు వ్యతిరేకంగా, జగన్ కు అనుకూలంగా తీవ్ర స్థాయిలో మాట్లాడారు. అయితే క్రమక్రమంగా గొంతు తగ్గిస్తూ వెనక్కి తగ్గుతూ వచ్చారు.

పార్లమెంటు సభ్యుడు సాయిప్రతాప్ కూడా మాట తీరు కూడా మారింది. కాంగ్రెసు పథకాలనే దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి అమలు చేశారని అన్నారు. తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపట్టిన పథకాలు అసంపూర్ణంగా మిగిలిపోయాయని వైయస్ జగన్ ప్రకటనకు దీన్ని విరుగుడుగా భావించవచ్చు. ఒక్కరొక్కరే ప్లేటు ఫిరాయిస్తూ రోశయ్యకు మద్దతు పలుకుతుండడం జగన్ వర్గాన్ని కలవర పరుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X